గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌?

SMTV Desk 2019-03-10 09:29:12  tdp party, gudivada constituency, andhrapradesh assembly elections, devineni avinash

కృష్ణా, మార్చ్ 09: తెలుగు దేశం పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం పోటీ చేయించాలని టీడీపీ యోచిస్తోందని సమాచారం. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని, టిడిపి అభ్యర్ధి రావి వెంకటేశ్వరరావుపై స్వల్ప మెజారీటీతో గెలుపొందారు. ఈ సారి అవినాష్‌ను బరిలోకి దింపి వ్యూహాత్మక ప్రయోగం చేయాలని భావిస్తుంది. త్వరలో దీనిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు.