టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటి సమావేశం

SMTV Desk 2019-03-08 16:17:51  tdp party election manifesto meeting, minister yanamala ramakrishnudu, ap assembly elections

అమరావతి, మార్చ్ 08: శుక్రవారం అమరావతిలోని ప్రజవేదికలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటి సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా 2019 ఎన్నికల ప్రణాళికకు వీరు తుదిమెరుగులు దిద్దారు. ఈ కమిటీ యొక్క ప్రధాన ఎజెండాగా రైతు, మహిళ, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నివేదికను సిద్ధం చేస్తోంది. అయితే ఇంకా ఒకట్రెండు సమావేశలతో మేనిఫెస్టోను ఖారారు చేసి సిఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. ఈసమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వాతిరాణి, అధికార ప్రతినిధి పి.అనురాధ, మాజీ మంత్రి పుష్పరాజ్, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.