ఏపీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు : గ‌ల్లా జ‌య‌దేవ్

SMTV Desk 2019-03-08 11:46:10  tdp mp galla jayadev, trs, kcr, bjp, narendra modi, deta scam

గుంటూరు, మార్చ్ 07: డేటా చోరీపై టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ విషయమై గల్లా జయదేవ్ తెలంగాణ సీఎం కెసిఆర్‌ పై నిపూలు చెరిగారు. ఏపీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని అరోపించారు. ప్రధాని మోదీని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని, మోదీ పాలసీలు, మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. కశ్మీర్ పరిస్థితులను మోదీకి అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటేసినట్లేనని అన్నారు. జగన్ సీఎం అయితే ఆయన స్విచ్ తెలంగాణలో, ఫ్యూజ్ ఢిల్లీలో ఉంటుందని విమర్శించారు.