తెలంగాణ మండల పరిషత్ రిజర్వేషన్లు ఖరారు

SMTV Desk 2019-03-05 16:47:03  telangana, mandala parishath reservation

లోక్‌సభ ఎన్నికల తరువాత జూన్ నెలలో తెలంగాణ మండల పరిషత్‌ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. రాష్ట్రంలో గల 535 మండల పరిషత్ (ఎంపిపి) స్థానాలలో 251 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేసింది. మిగిలిన 251 స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వర్గాలకు కలుపుకొని 50 శాతం కంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదు కనుక ఆ ప్రకారమే ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించింది. వాటి ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 94, ఎస్సీలకు 98, ఎస్టీలకు 92 స్థానాలను పంచాయతీరాజ్ శాఖ కేటాయించింది. జనరల్ మరియు రిజర్వ్ కేటగిరీలలో అన్ని స్థానాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించింది. వీటి ప్రకారం జిల్లా కలెక్టర్లు జిల్లాల వారీగా రిజర్వేషన్లు కేటాయింపులు జరుపుతారు.