అప్పుడు కత్తెర.. ఇప్పుడు దూది.. ప్రభుత్వ వైద్యుల నిర్వాకం

SMTV Desk 2019-03-05 13:04:27  Government Hospitals, Operations

సిద్ధిపేట, మార్చి 05: ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స అంటేనే ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు. దీనికి కారణం డాకర్ల నిర్లక్ష్యమే అని చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించి డాకర్లు కడుపులో కత్తెర మరిచిపోయన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఘటనే మరోకటి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా నంగునూరుకు చెందిన జంగిటి స్వప్న గత నెల 13న కాన్పు కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసి డాక్టర్లు డెలివరీ చేసారు. శస్త్రచికిత్స చేసేటప్పుడు స్వప్నకి తీవ్ర రక్త స్రవం కావడంతో దానిని ఆపేందుకు దూది ఉండను అమర్చారు వైద్యులు. సర్జరీ తర్వాత దానిని తీయటం మరిచిపోయిన డాక్టర్లు అలాగే కుట్లు వేసేశారు. ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఆమెకి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఇతర పరీక్షల్లో భాగంగా స్వప్న కడుపులో దూది ఉండ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి దానిని తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడిన కుటుంబసభ్యులు సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు.