పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో విడివిడిగా భేటీ

SMTV Desk 2019-03-04 16:09:29  ap cm, chandrababu, guntoor parliamentary leaders

గుంటూర్, మార్చ్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు గుంటూర్ పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లి అభ్యర్థులపై చర్చిస్తున్నారు. జిల్లాలో 5 అసెంబ్లి నియోజకవర్గాలపై స్పష్టత రావాల్సి ఉంది. తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థులపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారు.