అవసరమైతే జైలుకు కూడా వెళ్తా : ఎంపీ జయదేవ్

SMTV Desk 2019-03-04 16:07:36  MP Jayadev, tdp, trs, kcr. ysrcp, ys jagan mohan reddy, bjp, narendra modi, gujarat government, central government

గుంటూర్, మార్చ్ 3: ఎంపీ జయదేవ్ తాజాగా గుంటూరులోని మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ రాజకీయాన్ని దేశం మొత్తం రుద్దాలని మోదీ యత్నిస్తున్నారని, జగన్‌, కేసీఆర్‌తో కలిసి మోదీ కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వీరి ముగ్గురి దృష్టి ఇప్పుడు నాపై పడిందని, బడ్జెట్‌ స్పీచ్‌ అనంతరం నాకు ఈడీ నోటీసులు ఇచ్చారని జయదేవ్ అన్నారు. నేను పక్కాగా ట్యాక్స్‌ కడుతున్నా.. నా వద్ద ఏమీ దొరకలేదు.., నా బంధువులు, స్నేహితులనూ ఐటీ అధికారుల వేధిస్తున్నారు అని అన్నారు. అంతేకాక తాను ఎవరికీ భయపడనని, అవసరమైతే జైలుకెళ్తానన్నారు. ఏపీలో టీడీపీ గెలుపుకోసం దేశం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు.