వైసీపీకి ఝలక్ . టీడీపీ లోకి మరో కీలక నేత

SMTV Desk 2019-03-04 16:03:44  Shilpa Raj gopal reddy, tdp,

అమరావతి, మార్చ్ 03: ఏపి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో రాజకీయ చేరికలు ఉపందుకుంటున్నాయి . తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత శిల్పా రాజగోపాల్ రెడ్డి ఈరోజు టీడీపీలో చేరారు. శిల్పా రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి సోదరుడు కావడం గమనార్హం.

కర్నూలు జిల్లాలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి చేరికతో జిల్లాలో టీడీపీ మరింత బలపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..