జాకెట్టు ధర @ 33 లక్షలు

SMTV Desk 2017-05-27 18:46:45  dols and gabsana company,donaald trump,melania trump,itali

ఇటలీ, మే 26 : సాధారణంగా జాకెట్టు ధర ఎంతుంటుంది? మహా అయితే వేల రూపాయల్లో ఉంటుంది. కాని ఇక్కడ ఒక జాకెట్టు ధర అక్షరాల 33 లక్షల 50వేలు. నమ్మాలనిపించట్లేదు కదు. కానీ నమ్మి తీరాల్సిందే. ఇటలీ పర్యటనలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ జాకెట్టు ధర అక్షరాల 33 లక్షలంటే ఎవరైనా విస్తు పోవాల్సిందే. కెనడాలో నిర్వహిస్తున్న జి-7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ వెంట హాజరైన ఆమె ఆ జాకెట్టు ధరించింది. ఇటలీకి చెందిన డోల్స్ అండ్ గబ్సానా కంపేని ద్వారా ఈ జాకెట్టు తయారయింది. ఆర్డర్ ఇవ్వడంతో పాటే సగం ధర చెల్లిస్తే తప్ప ఆ జాకెట్టు తయారీని ఆ కంపేని ప్రారంభించదు. అటువంటి ప్రతిష్టాత్మకమైన కంపేని రూపొందించిన జాకెట్టును ధరించిన ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెనడా, ప్రాన్స్ దేశాల అధినేతల భార్యలతో కలిసి ఇటలీలోని చారిత్రాత్మక ప్రదేశాలను చుట్టి వస్తూ ఆనందంగా గడిపింది.