టీడీపీని వీడనున్న మరో సీనియర్ నేత

SMTV Desk 2019-03-02 12:10:44  Chandrababu Naidu, Shankar Reddy, Party Changing, TDP

అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగులుతుంది. తెలుగు దేశం పార్టీ కి చెందిన నాయకులు ఒకోక్కరిగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నాయకుల పార్టీకి గుడ్ బాయ్ చెప్పగా తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

తిరుపతి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి టీడీపీ వీడేందుకు సిద్దంగా ఉన్నారట. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన చేశారు. "టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యా. ఇప్పుడు విధేయుల అభిమతం మేరకు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది" అని ఆయన అన్నారు.

తన అనుచరులతో సమావేశమైన అయిన ఆయన, పార్టీ వీడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనకు పార్టీతో, అధినేత చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని చెబుతూనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.