అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు

SMTV Desk 2019-03-02 11:58:40  Airport, International Flights, Rejected, Pakistan

ఇస్లామాబాద్, మార్చి 2: గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకోవ‌డంతో పాకిస్థాన్ త‌న గ‌గ‌న‌త‌లంలో విమానాల రాకపోకలకు నిషేధ ఆజ్క్ష‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. మూడు రోజుల నుండి విమానాల‌ను కూడా ఆ దేశం ర‌ద్దు చేసింది. అనేక విమానాశ్ర‌యాల‌ను మూసివేంది. ఇందువల్ల క‌నీసం రోజుకు దాదాపు 400 అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ ఏయిర్‌స్పేస్‌ను మూసివేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్లు యూరోకంట్రోల్ పేర్కొన్న‌ది. ఇరాన్‌, జార్జియా, అజ‌ర్‌బైజాన్ లాంటి ప్రాంతాల‌కు వెళ్లాల్సిన విమానాలు నిర‌వ‌ధింగా వాయిదాప‌డ్డాయి. అయితే క‌రాచీ, పెషావ‌ర్‌, క్వెట్టా, ఇస్తామాబాద్ రూట్ల‌లో మాత్రం కొన్ని ఫ్ల‌యిట్ల‌ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు పాక్ విమాన‌యాన శాఖ కాసేప‌టి క్రితం వెల్ల‌డించింది.