పాక్ లో ఓఐసీ సదస్సు బహిష్కరణ...

SMTV Desk 2019-02-27 18:28:13  Pakistan foreign minister Shah Mehmood Qureshi , Organization of Islamic Cooperation

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 27: పాకిస్థాన్‌ విదేశాంగ శాఖా తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం నాటి భారత్‌ దాడులకు నిరసనగా పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మొహ్మద్‌ ఖురేషీ ఆరబ్‌ దేశాల ప్రతిష్ఠాత్మక ఆర్గనైజేషన్‌ ఆఫ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ (ఓఐసీ) సదస్సును బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ విదేశాంగ మంత్రికి సమాచారం ఇచ్చానన్నారు. యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడాను. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సమావేశానికి హాజరవుతుండడం పై అభ్యంతరాలను వారికి వివరించాను అని ఖురేషీ అన్నారు.
ఐఓసీలో దాదాపు 57 సభ్యదేశాలు ఉన్నాయి.