మెజార్టీ వాటాలను కొనుగోలు చేసిన జెబిఎం గ్రూప్

SMTV Desk 2019-02-26 18:55:15  Auto Components and Systems, JBM Group, Jbm Auto Ltd, Highvalue shares

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆటో విడిభాగాల తయారీలో పేరుగాంచిన సంస్థ జెబిఎం గ్రూప్. ఈ సంస్థ సోమవారం జర్మనీకి చెందిన లిండే వీమాన్‌ జిఎంబిహెచ్‌ కెజి సంస్థలో మెజార్టీ వాటాలను కొనుగోలుచేసింది. సంక్లిష్టమైన నిర్మాణ విడిభాగాలు, అసెంబ్లింగ్‌ విడిభాగాలను ఈ సంస్థ అందిస్తుంది. ఎక్కువగా అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్‌ ఉత్పత్తి కంపెనీలకు ఈ కంపెనీ విడిభాగాలు అందుతాయి. జెబిఎం గ్రూప్‌లోని అదునాతన కీలక ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఒక కీలక కంపెనీ వేదికపై కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు భారత్‌ విడిభాగాలను సైతం చేరువ చేసినట్లవుతుందని అంచనా. అయితే ఈ డీల్‌ ఎంతమొత్తం ఉంటుందన్న అంశంపై మాత్రం వెల్లడించలేదు. లిండే వీమాన్‌ 700 మిలియన్‌ డాలర్ల రాబడితో కొనసాగుతోంది. జర్మనీలోని డిల్లెన్‌బర్గ్‌ కేంద్రంగా ఉన్న లిండే వీమాన్‌ ట్యూబ్యులర్‌ అసెంబ్లీలు, ప్రత్యామ్నాయ సామగ్రి, అల్యూమినియం ఉత్పత్తులను ఎక్కువ ఆటో వ్యవస్థలకు అందిస్తుంది. ప్రస్తుత వాటా కొనుగోలువల్ల భారత్‌ మార్కెట్లకు జర్మనీ ఉత్పత్తులను మరిన్ని చేరువ చేయగలుగుతామని, లగ్జరీ ఉత్పత్తులు అసెంబ్లీ యూనిట్లు భారత్‌లో కూడా ఎక్కువగా ఉన్నందున వీటికి సైతం లీండే వీమాన్‌ ఉత్పత్తులు అవసరం అవుతాయన్న భావనలో కంపెనీ జెఎంబిలో వాటాలు కొనుగోలుచేసింది.