సర్జికల్ స్ట్రైక్ 2 ఒక నాన్ మిలటరీ స్ట్రైక్ : చైనా

SMTV Desk 2019-02-26 17:31:08  Pulwama attack, Indian airforce, Pakistan terrorists surgical strike, Indian army, azhar yusuf, China

బీజింగ్, ఫిబ్రవరి 26: పాక్ ఉగ్రవాదులపై భారత్ విమాన దళాలతో జరిపిన సర్జికల్ స్ట్రైక్2 పై చైనా తొలిసారిగా స్పందించింది. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ లు ముఖ్యమైన దేశాలని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు సహకరించాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ చెప్పారు. ఇవాళ ఆయన బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది నాన్ మిలటరీ స్ట్రైక్ గా అభివర్ణించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలన కోసం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీతో చైనా స్టేట్ కౌన్సిలర్ సోమవారం నాడు చర్చించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాక్‌పై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడిన తర్వాత పాక్ విదేశాంగ శాఖ మంత్రి చైనా విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు.