గ్రీన్ కార్డ్స్ జారీ ఇక పాయింట్స్ పద్ధతి : ట్రంప్

SMTV Desk 2017-08-03 16:23:11  green cards issue

వాషింగ్టన్, ఆగష్టు 3 : ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డ్స్ ను ఇకపై పాయింట్ల పద్ధతిలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పద్దతిని తీసుకువస్తానని ట్రంప్ గతంలోనే తెలియ‌జేశారు. దీని ప్రకారం తమ అర్హతల ఆధారంగా సాధించిన పాయింట్లను బట్టి గ్రీన్ కార్డు జారీ చేయనున్నారు. ఇంగ్లీష్ మాట్లాడం, చిన్న కుటుంబాలను కలిగి ఉండడం, అధిక జీతం పొందడం, అమెరికా ఆర్ధిక వ్యవస్థకు సదరు విదేశీయుడి సేవల అవసరం వంటి అంశాలకు అర్హతల ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ పద్ధతి వల్ల నిజంగా అమెరికా కోసం పాటుపడే వాళ్ళకు ఇక్కడ నివసించే అవకాశం కలుగుతుంది. అమెరికన్స్ కోరుకునేది కూడా ఇదే అని అధ్యక్షుడి ప్రధాన సలహాదారు జేసన్ మిల్లర్ తెలిపారు. అయితే ఈ విధానం అమలులోకి వస్తే చిన్న దేశాల నుంచి అమెరికా వచ్చే వారికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షం అభిప్రాయపడుతుంది.