మొదటి మ‌హిళా ఫైర్ ఫైట‌ర్‌... హ‌ర్షిణి క‌న్హేక‌ర్!

SMTV Desk 2017-08-03 15:50:59  FIRST WOMEN FIRE FIGHTER HARSHINI KANHEKAR

నాగ్‌పూర్‌, ఆగష్టు 3 : ఆమె చదివింది పూర్తిగా అమ్మాయిల కళాశాలలో కానీ మొత్తం అబ్బాయిలే ఉండే ఫైర్ స‌ర్వీస్ కాలేజీలో అడుగుపెట్టింది. అయినా ఏ మాత్రం స్థైర్యాన్ని కోల్పోకుండా కష్టపడి అనుకున్నది సాధించింది. వివరాలిలా ఉన్నాయి.. హ‌ర్షిణి క‌న్హేక‌ర్ మొత్తం అబ్బాయిలే ఉండే నాగ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఫైర్ స‌ర్వీస్ కాలేజీలో అడుగుపెట్టింది. "అమ్మాయివి క‌దా ఈ రంగం ఎందుకు ఎంచుకున్నావ్" అని వినిపించే ప్రశ్నలతో సతమతమయ్యేది అయినా మగవాళ్ళకు ధీటుగా డ్రిల్స్ చేసింది. చివ‌ర‌కు ఏడు సెమిస్టర్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసిన మొద‌టి మ‌హిళా ఫైర్ ఫైట‌ర్‌గా క్యాంప‌స్ నుంచి బ‌య‌టికొచ్చింది. అసలు ఆ క్యాంపస్ లో 2002 వరకు అమ్మాయిలే లేరు దీంతో నాకోసం ప్రత్యేకమైన వసతులు కల్పించవలసి వచ్చింది. నేను కనపడితే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడేవారు. అందులో కొన్ని ప్రోత్సాహాక‌రంగా, మరికొన్ని నిరుత్సాహ‌కరంగా ఉండేవి. కాగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో మొద‌టి మ‌హిళా పైల‌ట్‌గా ఎదిగిన శివాని కుల‌క‌ర్ణి త‌న‌కు ఆదర్శమని హ‌ర్షిణి తెలిపారు. ఫైర్ ఫైట‌ర్‌గా త‌న వృత్తి చాలా సంతృప్తిక‌రంగా ఉందని, మంట‌ల్లో చిక్కుకున్న వారిని కాపాడిన‌పుడు వాళ్ల కళ్ళల్లో క‌నిపించే కృతజ్ఞతను మాటల్లో వర్ణించలేనని తెలిపారు. అమ్మాయిలను ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణించగలరని హర్షిణి పేర్కొన్నారు.