మహిళ కంటిలో 15 సెంటీమీటర్ల నులి పురుగు

SMTV Desk 2019-02-22 15:50:09  Vizag, Shankar Foundation Hospital

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: చిన్న నొప్పె కదా అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం చేస్తే అది ప్రమాదాలకు దారి తీస్తుంది. మానవ శరీర భాగాలలో అతి సున్నితమైన భాగమైన కంటిలో చిన్న నలుసు పడితేనే అల్లాడిపోతాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 15 సెంటీమీటర్ల పొడువున్న నులిపురుగు దాడితో అల్లాడిపోయింది. వివరాలలోకెళితే... విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన బి.భారతికి కొన్ని సంవత్సరాలుగా కంటినొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. ఆఖరి ప్రయత్నంగా విశాఖపట్నంలోని శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి వెళ్ళింది. వారు ఆమెకు మొదట స్కానింగ్ చేసి నులిపురుగు ఉన్నట్లు గుర్తించారు. సర్జరీకి సిద్ధం అవుతుండగా అది లోపలికి వెళ్లిపోయింది. బుధవారం నులి పురుగు మళ్ళీ కొద్దిగా బయటికి రావడంతో సర్జరీ చేసి దాన్ని బయటకు తీశారు.కంటినొప్పిని చాలా ఏళ్లపాటు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా జరిగిందని సర్జరీ చేసిన డాక్టర్ నజరిన్ తెలిపారు.