బందిపోట్లలా ఉన్న టీడీపీ తమ్ముళ్లు : వైసీపీ నేత

SMTV Desk 2019-02-12 19:11:57  vijayasai reddy, ysrcp, chandrababu, black shirt, ap assembly elections 2019, narendra modi, amith shah

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: నిన్న ఢిల్లీలో జరిగిన టీడీపీ ధర్మపోరాట దీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధరించిన నల్ల చొక్కా గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దవా చేసారు. అలాగే సీఎం చంద్రబాబు ఇటీవల అమిత్ షా ఆంద్రాలో పర్యటించినప్పుడు నల్లచొక్కా ధరించి నిరసన తెలిపారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు పర్యటన సందర్భంగా చంద్రబాబు నల్లచొక్కా ధరించి నిరసన తెలిపారు. కాగా చంద్రబాబు, ఇతర నాయకులు వేసుకున్న నల్లచొక్కాలపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా పంచ్ లు విసిరారు.

ఆయన తన ట్విట్టర్ ఖాతాలో నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు అని ట్వీట్ చేసారు. ఇంకా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్‌ చదవటం లాంటిదేనని, ఆఖరు నిమిషం దీక్ష వల్ల ఆయనకు, రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.