జీవీఎల్ ఓ బ్రోకర్ : బుద్ధా వెంకన్న

SMTV Desk 2019-02-07 17:54:43  GVL Narasimha rao, bjp, budda venkanna, tdp, call money sex racket

అమరావతి, ఫిబ్రవరి 7: నిన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. జీవీఎల్ నరసింహారావు ఓ పవర్ బ్రోకర్ అని విమర్శించారు. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జీవీఎల్ తనపై ఫిర్యాదు చేయడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనను అంతం చేయడానికి బీజేపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయమై తాను డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా నిన్న జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్ మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారంలో బుద్ధా వెంకన్న సూత్రధారని, ఆయనపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశానన్న సంగతి తెలిసిందే. నిన్న జీవీఎల్ బుద్ధా వెంకన్న బహిరంగంగా క్షమాపణ చెబితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తానని కూడా అన్నారు.