కొత్త ప్రేయసి రావడంతో పాత ప్రేయసిని హతమార్చిన వైనం

SMTV Desk 2017-08-02 14:34:27  amerika, Ohio, Arturo Nouvão, Katrina Leighton, Shannon Graves, Fridge

అమెరికా, ఆగస్టు 2 : కొత్తొక వింత..పాతొక రోత అన్నట్టుగా ప్రేమించిన యువతితో సహజీవనం చేస్తూ, మరో యువతితో కూడా ప్రేమలో పడి, తమ మధ్య సహజీవనం చేస్తున్న యువతి ఎందుకని ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి ఫ్రీజ్ లో దాచిపెట్టిన ఘటన అమెరికాలోని ఓహియోలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన అర్టురో నొవావో అనే యువకుడి ఇంటికి గత నెలలో కత్రినా లైటన్ అనే యువతి వచ్చింది. అప్పటికే షనాన్ గ్రేవ్స్ అనే యువతితో సహజీవనం చేసిన నొవావో, ఆమె స్థానంలో కత్రినాను తీసుకువచ్చాడు. షనాన్ జూన్ 22 నుంచి కనిపించకుండా పోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఇక షనాన్ స్థానంలో నువావో ఇంటికి వచ్చిన కత్రినా, మాయమైన తన ప్రియుడి మాజీ స్నేహితురాలి వస్తువులన్నీ వాడటం మొదలు పెట్టింది. ఆమె సెల్ ఫోన్ ను, కారును వాడటంతో పాటు, ఆమె పెంచుకున్న కుక్క యోగక్షేమాలనూ చూస్తోంది. ఇక, తన ఇంట్లో విద్యుత్ సమస్య ఉందని, ఫ్రిజ్ లో భారీగా మాంసం పేరుకుపోయిందని, దాన్ని పాడుచేయడం ఇష్టం లేదని, ఫ్రిజ్ ను బేస్ మెంట్ లో ఉంచాలని ఇంటి యజమానురాలిని అర్టురో నొవావో కోరాడు. ఆ ఫ్రిజ్ కు లాక్ చేసి ఉండటం, సాధారణ బరువుతో పోలిస్తే చాలా బరువుగా ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులను సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. తీగ లాగిన పోలీసులు కత్రినాను, నువావోను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. షనాన్ మృతికి అసలు కారణం ఏంటో ఇంకా వెలుగులోకి రాలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.