మోడీకి మద్దతిస్తున్న జగన్, కేసిఆర్

SMTV Desk 2019-02-05 13:58:00  Chandrababu, Jagan, KCR, West Bengal, Central Government, Narendra Modi

అమరావతి, ఫిబ్రవరి 5: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపి అధ్యక్షుడు జగన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మండి పడ్డారు. ఈరోజు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో కేంద్రం చర్యను అందరు ఖండించారు. కానీ ఈ విషయం పై కేసీఆర్, జగన్ మాత్రం ఇంకా స్పందించకుండా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. జగన్ మోడీకి మద్దతు పలకడం వల్లే మైనారిటీలు జగన్ కు దూరం అయ్యాయని అన్నారు. అందుకే జగన్ కులాల మద్య చిచ్చు పెట్టాడని, ఆయకు కుల పిచ్చి ఎంత ఉందో అందరికి తెలుసని చంద్రబాబు విమర్శించారు.

అంతేకాకుండా సామజిక న్యాయం కోసం పోరాడానని చెప్పుకునే కేసిఆర్ బెంగాల్ లో కేంద్రం చర్య పై ఎందుకు స్పందించలేదని అడిగారు. సామజిక న్యాయం కోసం తెలుగుదేశం తప్ప మరే ఇతర పార్టీ కూడా కృషి చేయలేదని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నామన్నారు.