అందుకే బాబుతో భేటి అయ్యాను : కేంద్ర మంత్రి

SMTV Desk 2019-01-31 17:22:11  Chandrababu, Kotla surya prakash reddy, Central minister

కర్నూల్, జనవరి 31: మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో భేటి అయిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం కర్నూల్ చేరుకున్న సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు గౌరవంగా విందుకు ఆహ్వానిస్తే అతిథిగా వెళ్లానని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక హోదా తదితర సున్నిత అంశాలపై చర్చించినట్టు కోట్ల మీడియాకు వివరించారు.

జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తనతో సహకరించాలని చంద్రబాబు కోరారని కోట్ల చెప్పారు. టీడీపీలో ఎప్పుడు చేరుతారనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.