మోదీ నాకంటే జూనియర్: బాబు

SMTV Desk 2019-01-31 15:33:22  Chandrababu, Naredndra Modi, Amaravathi, Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్, జనవరి 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ పై కీలకమైన వ్యాఖ్యలు చేసారు. అమరావతి లో జరిగిన అఖిలపక్ష సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీని సార్ అని సంభోదించానని చంద్రబాబు అన్నారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అప్పట్లో భారత్ కు వచ్చినప్పుడు తాను ఆయన్ను మిస్టర్ క్లింటన్ అని మాత్రమే పిలిచానని గుర్తుచేసుకున్నారు. మోదీ రాజకీయాల్లో నాకన్నా జూనియరే అయినా, అధికారంలోకి వచ్చాక ఆయన్ని 10 సార్లు సార్ అని పిలిచా.

అన్యాయంగా విభజించిన రాష్ట్రానికి మోదీ న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇదంతా చేశానని, అయినా కూడా అన్యాయమే చేశారని ఆరోపించారు. మోదీ రాజకీయాల్లో నాకన్నా జూనియరే అయినా, అధికారంలోకి వచ్చాక ఆయన్ని 10 సార్లు సార్ అని పిలిచానని చంద్రబాబు అన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, వొకవేళ పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే మరో 10 అసెంబ్లీ స్థానాలను అధికంగా గెలిచేవాళ్లమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.