సీఎం చేతుల మీదుగా భూకర్షణమ్..

SMTV Desk 2019-01-31 12:59:50  Andhra Pradesh, CM Chandrababu, foundation laying ceremony, Sri Venkateswara Swami Temple Amaravati, TTD, tirumala tirupati devasthanam

అమరావతి, జనవరి 31: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈరోజు శ్రీవారి ఆలయ నిర్మాణానికి మొదటి అడుగు పడింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఇప్పటికే తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు చేతుల మీదుగా భూకర్షణ, బీజావాపనాన్ని నిర్వహించింది.

అయితే కృష్ణానది తీరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయం చాళుక్యులు, చోళుల కాలం నాటి వాస్తు, నిర్మాణ శైలికి అద్దం పడుతుందంటున్నారు. కాగా అమరావతిలో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే 7 ఎకరాల్లో ఆలయం.. మిగతా 18 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ఉంటుందని... రానున్న రెండేళ్లలో 4 దశల్లో ఆలయ నిర్మాణం పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని టీటీడీ పేర్కొంది.