ఇక ఏపీ అంతా ఒకే నెంబర్..

SMTV Desk 2019-01-30 17:44:15  ap, achhennayudu, ap transport department, ap series number

జనవరి 30: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ లో వన్ స్టేట్, వన్ నెంబరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి రాష్ట్రలో వాహనాలకు వొకే సీరీస్ అమల్లోకి వస్తుంది. ఇక నుంచి రాష్ట్రలో వాహనాలకు 39 సీరీస్ తో రిజిస్ట్రేషన్ జరుగుతుందని, జిల్లాలవారి కోడ్ సిరీస్ నెంబర్లకు స్వస్తి పలికినట్లు ఆయన చెప్పారు. గతంలో ట్రాన్సపోర్టు డిపార్టుమెంట్ అంటేనే లంచాలకు ప్రతిరూపంగా ఉండేదని, ఈ నాలుగున్నరేళ్ల కలం లో బెస్ట్ డిపార్ట్మెంట్ గా ఎదగటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ వన్ స్టేట్ వన్ నెంబర్ విధానం ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని రవాణామంత్రి చెప్పుకొచ్చారు. అయితే వేలు ముద్రతో పాటుగా ఐరిష్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా చూడాలని సూచించారు. రవాణాశాఖలో థర్డ్ పార్టీ విధానం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.