ఏపీని కరవు రహిత ప్రాంతంగా చేస్తా : గవర్నర్

SMTV Desk 2019-01-30 12:22:19  ESL Narasimhan, ap governor, polavaram project, Ginnis book record

జనవరి 30: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ.. రాబోయే పది సంవత్సరాలలో భారతదేశంలోనే ఏపీ అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని అన్నారు. ఈరోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రానున్న ఐదేళ్లలో ప్రజలు సంతృప్తి పడే విధంగా పాలన సాగించేందుకు సాంకేతికతను సాయంగా తీసుకోనున్నామని, ఇప్పటికే విజన్ తయారైందని చెప్పారు. శ్రామికులకు 90 శాతం రాయితీతో పనిముట్లు సమకూరుస్తున్న ఏకైక ప్రభుత్వం తనదేనని చెప్పారు. ఈమద్యే పోలవరం ప్రాజెక్ట్‌ కాంక్రీట్ పనులకు గిన్నిస్‌ గుర్తింపు వచ్చిందని చెప్పిన ఆయన, త్వరలోనే పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తిచేస్తాం అన్నారు.

కాగా, త్వరలోనే 11 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి,వారి అభ్యన్నతికి కృషి చేస్తామని చెప్పారు. రైతులకు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, అతి త్వరలోనే రెండు విడతల్లో రుణమాఫీకి చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఏపీని కరవు రహిత ప్రాంతంగా నిలపడమే తన ముందున్న లక్ష్యమని నరసింహన్ అన్నారు.