ఆంధ్రా కియా కారు త్వరలో

SMTV Desk 2019-01-26 16:53:06  Andhra KIa Car, Andhra Pradesh,

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పధకాన్ని అమలుచేస్తోంది. దానిలో భాగంగా దక్షిణకొరియకు చెందిన కియా మోటర్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని పెనుకొండ వద్ద అత్యాధునికమైన కార్లు తయారీ కంపెనీని ఏర్పాటు చేసింది. దానిలో ఇటీవలే ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. అక్కడ తయారైన మొట్టమొదటి కారును ఈనెల 29న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేస్తారు. చంద్రబాబునాయుడు దీనిని టెస్ట్ డ్రైవ్ చేయనున్నారు కనుక తొలికారుకు కంపెనీ ఉద్యోగులు ట్రైయల్ రన్స్ నిర్వహించి పరీక్షిస్తున్నారు. ప్రతీ ఆరునెలలకు వొక కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. ఈ ప్లాంటులో మొదటి దశలో ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలిపారు. రెండవ దశలో ఏడాదికి మరో లక్ష కార్లు తయారుచేయడానికి వీలుగా ప్లాంటును విస్తరిస్తామని తెలిపారు. ఈ ప్లాంటుకు అనుబందంగా 18 చిన్న, మీడియం పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కియా కంపెనీలో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా వేలమందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు లభించాయి.