నారా లోకేష్ బర్త్ డే...విష్ చేసిన సీఎం

SMTV Desk 2019-01-23 13:46:13  Nara lokesh, Nara lokesh birthday, Chandrababu, Twitter, Birthday wishes

అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కుమారునికి ఏపీ సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాక తన అధికార ట్విట్టర్ ఖాతాలో కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ నారా లోకేశ్‌కు నా ఆశీస్సులు, పూర్తి నిజాయితీ, అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకు తన సేవలను లోకేశ్ కొనసాగిస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం ట్వీట్ చేశారు.

ప్రస్తుతం లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గోంటున్నారు. అంతకు ముందు చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోటని, ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన జిల్లా ప్రజలను ఆదుకోవడం తన బాధ్యతని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. దీనిలో భాగంగానే కృష్ణాజలాలను చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చానని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని జిల్లాకు ఇంకా చాలా చేస్తామని హామీ ఇచ్చారు.

#twitter1#