ఏపీ కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..???

SMTV Desk 2019-01-19 18:17:38  Andhrapradesh cabinet meetings, TDP, Chandrababu

అమరావతి, జనవరి 19: సోమవారం ఉదయం అమరావతిలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. అంతేకాక జిల్లాల నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యెలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షలు కూడా పాల్గొనున్నారు.

ఇదే రోజు మధ్యాహ్నం 3గంటలకు ఏపి కేబినెట్‌ సమావేశం కానుంది.కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని టిడిపిపీ నేతలు చెబుతున్నారు.