నాకు ఫోన్ చేసి మాట్లాడాలి అంటున్న ట్రంప్

SMTV Desk 2017-06-01 12:01:54  America,Donald TRump, Cellphone,Meksiko,

అమెరికా, మే 31 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది. తన సెల్‌ఫోన్‌కు కాల్‌ చేసి నేరుగా మాట్లాడాలని ప్రపంచదేశాల నేతలకు ఆయన పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. అధ్యక్షుడి వైఖరితో దౌత్య పరమైన రహస్యాలు, దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు హ్యాక్‌ చేసే ప్రమాదముందని అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మెక్సికో, కెనడా నేతలకు తన ఫోన్ నంబర్‌ ఇచ్చిన ట్రంప్‌ ఎప్పుడైనా తనతో నేరుగా మాట్లాడవచ్చని వారికి తెలిపారు. ఆయనిచ్చిన ఆఫర్‌ను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడే వినియోగించుకున్నారు.