తలసాని ఎఫెక్ట్...కనకదుర్గ ఆలయంలో కొత్త నింబంధనలు

SMTV Desk 2019-01-17 19:23:08  Vijayawada kanadurga temple, TRS MLA, Talasani srinivas yadav

విజయవాడ, జనవరి 17: విజయవాడ కనకదుర్గ ఆలయ సిబ్బంది కొత్త నిబంధనలను విధించింది. తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కనక దుర్గమ్మను దర్శించుకొని అనంతరం అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి పలు వ్యాఖ్యలు చేయడం పై ఏపీ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆలయ పరిసరాలు ఆధాత్మికంగానే ఉండాలంటూ కొత్త నింబంధనలు విధించింది. ఆలయం పరిసరాల్లో రాజకీయాలు మాట్లాకూడదని, ఎటువంటి ప్రెస్‌మీట్‌లకు అనుమతి లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారపరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు.