ఇకపై వ్యవసాయానికి 9 గంటలు కరెంట్

SMTV Desk 2019-01-14 17:14:40  AP CM, Chandrababu, Power supply

అమరావతి, 14: సంక్రాంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర రైతులకు మరో కానుకగా ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న ఏడు గంటల విద్యుత్ ను 9 గంటలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 10,831 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతుండగా తాజా నిర్ణయంతో మరో 2800 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని విద్యుత్‌ శాఖ అంచనా.

వ్యవసాయ రంగానికి సబ్సిడీ విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ. 6,030 కోట్లు ఖర్చు చేస్తుంది. తాజా నిర్ణయంతో మరో రూ. 1200 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు సౌర విద్యుత్‌తో నడిచే 16 లక్షల పంపుసెట్లను రాష్ట్ర వ్యాప్తంగా అందిచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.