బాబుకి రిటర్న్ గిఫ్ట్ తప్పదు...

SMTV Desk 2019-01-14 16:58:14  Talasani srinivasyadav, Telnagana minister, AP Chief minister chandrababu

విజయవాడ, జనవరి 14: విజయవాడలోని ఇబ్రహీం పట్నం నుండి దుర్గగుడి వరకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భారీ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఏపీ సీఎం కు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, రాజకీయాల్లో ఇచ్చుపుచ్చుకోవడం సహజమని వ్యాఖ్యానించారు. అంతేకాక ఏపిలో ప్రభుత్వ పనితీరు ఆశాజనకంగా లేదని ఆరోపించారు.

ఏపిలో ప్రజలు సంక్షేమం, అభివృద్ది కోరుకుంటున్నారని, చంద్రబాబు మాత్రం రోజూ బాహుబలి చూపిస్తున్నారని విమర్శించారు. హైటెక్‌సిటీ కట్టి హైదరాబాద్‌ అంతా కట్టానని బాబు చెప్పుకుంటున్నారని, బిజెపి, కాంగ్రెస్‌ లేని ఫెడరల్‌ ఫ్రంట్‌ కోరుకుంటున్నామని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.