చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా

SMTV Desk 2019-01-05 15:57:26  YSRCP, MLA, Roja, TDP, Chandrababu, YS Jaganmohan reddy

అమరావతి, జనవరి 5: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై దాడి కేసులో హైకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ ని కూడా చంద్రబాబు గౌరవించడం లేదని ఆమె మండిపడ్డారు. దొంగలను, ఆర్థిక నేరగాళ్లను కాపాడే అడ్డగా ఏపీని మార్చేశారన్నారు. జగన్ పై హత్యాయత్నం చేసింది ముమ్మాటికీ చంద్రబాబేనని అందుకు ఆయన మాటలే నిదర్శనమన్నారు. ఇదంతా ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజీఅనే నటుడితో చెప్పిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఓ హిట్లర్ లాగా నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం కాకినాడలో ఓ మహిళను పట్టుకొని.. ఫినిష్ చేస్తా అంటూ ఓ గుండాలాగా ప్రవర్తించాడన్నారు.

అసెంబ్లీలో కూడా చాలా సార్లు ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తానని చంద్రబాబు చాలా సార్లు బెదిరించారని ఆమె గుర్తు చేశారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యకు ప్లాన్ చేస్తే..నేరం కేంద్రం పైకి పోతుందని చంద్రబాబు భావించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్ఐఏ విచారణకు వెళ్లడానికి నిందితుడు శ్రీనివాస్ కి లేని బాధ చంద్రబాబు లోకేష్ లకు ఎందుకని ప్రశ్నించారు. ఎన్ఐఏకి కేసు అప్పగించాలని అధికారులు కోరుతుంటే.. పోలీసులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. హత్యాయత్నం వెనుక ఉన్న అందరినీ బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లింది చంద్రబాబేనని.. మళ్లీ జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి గడిచిన నాలుగేళ్లలో ఏమి చేయాలో అవన్నీ ఏపీ సీఎం చంద్రబాబు చేశారని రోజా ఆరోపించారు.