బీజేపీ నేతలపై టీడీపీ నేతల రివేంజ్

SMTV Desk 2019-01-05 13:12:45  TDP, BJP, Chandrababu, Narendramodi, Party leaders, Guntoor, Kakinada, Kanna lakshmi narayana

గుంటూరు, జనవరి 5: శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కాన్వాయిని బీజేపీ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి నిరసనగా తెదేపా నేతలు ఈ రోజు గుంటూరులో ఆందోళనకు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ కి, కన్నా లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా రంగంలోకి వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా పోటీపోటాగా ఆందోళన చేపట్టారు. మోదీ, కన్నాకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతల ఆందోళతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.