అగ్రిగోల్ద్ కేసులో వైసీపీనే దోషిగా చూపాలని టీడీపీ ప్రయత్నం : బొత్స

SMTV Desk 2019-01-04 14:16:21  Agrigold, High court, SBI, International builders, GSL Groups, hailand, AP, Government, Bothsa narayana

అమరావతి, జనవరి 4: అగ్రిగోల్ద్ భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలువడానికి ప్రయత్నిస్తూ బాదితులకు నష్ట పరిహారం చెల్లించేలా సర్కార్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వ వ్యవహారం పై వైఎస్సార్‌సిపి నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్ద్ బాధితులకు అన్యాయం చేసేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ వారి కోసం పోరాడుతున్న వైసీపీ నే దోషులుగా చూపించాలని ప్రయత్నించడం సిగ్గుచేటని బొత్స విమర్శించారు. అగ్రిగోల్డ్ భూములను తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కొనుక్కోవాలంటూ టిడిపి నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతలా కావాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబే అడ్డదిడ్డంగా కాకుండా న్యాయంగా ఆభూములు కొనుక్కుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని సూచించారు.

అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగమైన హాయ్ లాండ్ భూములను దోచుకోడానికి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ప్రయత్నించారని ఆరోపించారు. అందుకోసమే డిల్లీలో అర్ధరాత్రి రహస్య మంతనాలు జరిపారన్నారు. అయితే ఈ విషయం బయటపడేసరికి ప్రత్యేక హోదా మద్దతు కోసం ప్రయత్నాలు చేయడానికి డిల్లీకి వెళ్లినట్లు ప్రచారం చేసుకున్నారని బొత్స తెలిపారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనాన్స్, రెవెన్యూ మంత్రి వున్నారా అని అనుమానం కలుగుతోందని బొత్స అన్నారు. అసలు క్యాబినెట్ వుందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు, లోకేష్ అజమాయిషీ ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఎవరో కుటుంబ రావు మాట్లాడటం, చుక్కా భూములు రెవెన్యూ మంత్రి కాకుండా ఓ సినిమా యాక్టర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు చుక్కా భూముల వ్యవహారం కూడా పెద్ద స్కామని బొత్స ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికే న్యాయం జరుగుతోందని బొత్స ఆరోపించారు. గతంలో అమరేశ్వర్ స్వామి భూములను కూడా ఇలాగే కాజేయాలని ప్రయత్నించారని...దానిపై వైసిపి పార్టీ పోరాడటం వల్ల వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. ఇలా అక్రమ పాలన వల్ల నష్టపోయిన ప్రజలు ఉసురు ఈ ప్రభుత్వానికి తాకుతుందన్నారు. అందువల్ల జిమిక్కులను ఆపాలన్నారు. తన తాబేదార్లు, కాంట్రాక్టర్ల కోసం కాకుండా పేదవాళ్ల కోసం పాలన కొనసాగించాలని చంద్రబాబుకు బొత్స సూచించారు.