వైసీపీ లోకి సినీ నటుడు అలీ...???

SMTV Desk 2019-01-04 11:14:24  YRCP, YS Jagan mohan reddy, Ali

అమరావతి, జనవరి 4: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రజాసంకల్ప యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు ప్రముఖ సినీ నటుడు అలీ వైసీపీ లోకి రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడు అని సమాచారం. గత నెలలో జగన్ ను ఎయిర్ పోర్టులో కలిసిన అలీ ఈ విషయం పై చర్చించుకున్నట్టు పలు వర్గాలు చెప్తున్నాయి.

ఇంతకు ముందు జగన్ పాదయాత్రలో కూడా అలీ పాల్పంచుకున్నాడు. ఈ పరినామలన్ని చూస్తె అలీ ఖచ్చితంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయాల్లో వార్తలు మొదలయ్యాయి. కాగా వాటిని ఇప్పుడు అలీ నిజం చేశారు. జగన్ ఆదేశిస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమంటూ అలీ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. గత నెలలో జగన్ ని ఆలీ కలిసినప్పుడు సుమారు గంటపాటు వ్యక్తిగతంగా చర్చించుకున్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రపై అలీ ప్రశంసలు కురిపించారు. నిత్యం ప్రజల్లో ఉండాలనే తపనతో ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అలీ అభిప్రాయపడ్డారు. అలాగే పాదయాత్రలో పార్టీకి వస్తున్న మైలేజ్ పై కూడా ఇరువురు చర్చించుకున్నారు.