పోలవరాన్ని కేంద్రానికి వదిలేస్తే ఇప్పటికే పూర్తయ్యేది : వైసీపి ఎంపి

SMTV Desk 2018-12-28 11:51:59  AP, CM, Chandrababu, YSRCP, Vijayasai reddy, Polavaram project, BJP, Central governament

హైదరాబాద్‌,డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నిర్ణయించుకొని గురువారం రోజు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణంపై ప్రతిపక్షాలు ద్వజమెత్తుతున్నాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికి వదిలస్తే ఈ పాటికి పూర్తయ్యేదని, రాష్ట్రమే చేపడుతుందని చెప్పి వ్యయాన్ని అడ్డగోలుగా రూ.58వేల కోట్లకు పెంచారని, ఖర్చుకు లెక్క చూపకుండా, యూసిలు పంపకుండా రాష్ట్ర వరప్రదాయినిని కుంభకోణాల పుట్టగా నాయుడుబాబు మార్చారని అంటూ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

అంతేకాక బిజెపి వ్యతిరేఖ ఫ్రంట్‌ పేరుతో మీరు వీణలు బహుకరించిన వారంతా కెసిఆర్‌ను స్వాగతించి ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలను అభినందిస్తున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ తానే స్వయంగా కెసిఆర్‌ను కలుస్తానని ప్రకటించారు. మీ యాత్రలన్ని ఫెయిల్‌ అయినట్లు ఉన్నాయి చంద్రంసారూ అంటూ ట్వీట్‌ చేశారు.

గెలిచిన వారికే గొడుగులు పడతారు. విభజన హామీలకు ప్రత్యేక హోదాకు నాలుగున్నర సంవత్సరాలుగా తుప్పు పట్టించిన మీరు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి రాష్ట్ర డబ్బుతో ఎన్నికలకు మూడు నెలల ముందు శంకుస్థాపన చేస్తారా? చుట్టూ కొన్న వేల ఎకరాల కోసం మీరు ఆడుతున్న నాటకం ఇప్పటికే కడప ప్రజలకు అర్థమైందన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన 2018 అతి పెద్ద జోక్‌గా చెప్పొచ్చు. 18వేల కోట్లతో నిర్మిస్తారట. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫకేషన్‌ వస్తుంటే ఎవరిని మోసం చేయడానికి నాయుడుబాబు ఈ హడావుడి. టెండర్లు లేవు, టెక్నాలజీ ఎంపిక జరగలలేదు, బినామీల రియల్‌ ఎస్టేట్‌ దందా కోసమేనా అంటూ ప్రశ్నించారు. స్వంతవూర్లో ఉపాధి దొరికితే ఎవ్వరూ వలస వెల్లరు. పని కల్పించడంలో విఫలమైన చంద్రబాబు రాయలసీమ, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు సరదా కోసం వలస వెళ్లారని అనడం వారిని అవమానించడమే. గతంలో పాలమూరు ప్రజలను ఇలాగే హేళన చేస్తే తరిమి కొట్టారని, వలస జీవుల తడాఖా ఈ సారి ఎన్నికలో రుచి చూపిస్తారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.