శాంతాక్లాజ్‌ వేషంలో బరాక్‌ ఒబామా.!

SMTV Desk 2018-12-21 13:44:29  Barack Obama

అమెరికా, డిసెంబర్ 21: అమెరికా సంయుక్త రాష్ట్రాల మాజీ అధ్యక్షుడు బరాక్‌ వొబామా సామాజిక కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉంటారు. సామాజిక సమస్యల పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్రిస్మస్‌ సమీపిస్తుండటంతో శాంతాక్లాజ్‌ వేషధారణలో వాషింగ్టన్‌లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి వెళ్లి అక్కడి పిల్లలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శాంతాక్లాజ్‌ టోపి పెట్టుకుని పిల్లలకు క్రిస్మన్‌ కానుకలు ఇచ్చి కాసేపు వారితో ఆట, పాటలాడారు.(Former US President Barack Obama’s surprise visit to a children’s hospital in America is winning many hearts on social media.)




కానుకల సంచిని భుజాన వేసుకుని వొబామా నడుచుకుంటూ వస్తున్న ఫొటో వొకటి ఇపుడు నెట్ లో వైరల్‌ అవుతోంది. అద్భుతమైన, అందమైన పిల్లలతో ఆడుకునే అవకాశం కల్పించిన ఆసుపత్రికి యాజమాన్యానికి ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడూ ఇలాగే నవ్వుతు ఉండాలి అని వొబామా చెప్పుకొచ్చారు. పిల్లల పట్ల వొబామా చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయి మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.