అమెరికాలో కురిసిన నోట్ల వర్షం

SMTV Desk 2018-12-17 18:33:54  America, new jerssy, Currency dropped by vehcile

న్యూజెర్సీ, డిసెంబర్ 17: నగర ప్రాంత నడి రోడ్డుపై ఈ రోజు ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. భారీ నగదుతో వెళుతున్న ఓ ట్రక్ లో నుంచి డబ్బులు రోడ్డుపై పడిపోయాయి. దీంతో వొక్కసారిగా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. వాహనదారులు తమ కార్లను పక్కకు ఆపి రోడ్డుపై పడ్డ డబ్బులను ఏరుకునేందుకు పోటీ పడ్డారు. అక్షరాలా.. రూ. 2.15 కోట్లు క్షణాల్లో మాయమైపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రక్ తలుపులు సరిగా బిగించకపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు.

దారిలో వొక తలుపు తెరుచుకుని డబ్బు రోడ్డుపై పడిపోయాయని తెలిపారు. డబ్బును తీసుకున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.