చెన్నైకి దగ్గర లో 'పెథాయ్ తూఫాన్'

SMTV Desk 2018-12-15 19:12:08  #CyclonePhethai, amaravathi, chandarababu naidu, chennai, CBN, TDP,CHENNAI

అమరావతి , డిసెంబర్ 15 :బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతూ చెన్నైకి 360కీమీ ల దూరంలో ఉన్న "పెథాయ్ తూఫాన్ " సోమవారం ఉదయం కాకినాడ, నెల్లూరు మధ్యలో తీరం దాటవచ్చని , ఎక్కువ శాతం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు . ఈ రోజు రాత్రి నుండి వర్షం పడే అవకాశం ఉంది , చెన్నై తీరం లో ఇప్పటికే 40-50 కీ మీ ల వేగంతో గాలులు వీస్తుండగా రేపటికి మరింత వేగంగా మారే అవకాశం ఉందని అంచనాలో ఉన్నారు .ఏది ఏమయినా ప్రతి సంవత్సరం ఈ తుపాన్లు ఆంధ్రా ప్రజల ధైర్యాన్ని పరీక్షించడానికి వస్తున్నట్లుగా ఉన్నాయి . ఇప్పటి వరకు వచ్చిన అన్ని తూపాన్లని సమర్దవంతంగా ఎదురొడ్డి నిలిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విపత్తుని కూడా ఎదుర్కోడానికి శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారు.