ముద్రగడ హౌస్ అరెస్టు

SMTV Desk 2017-07-26 11:18:36  mudragada padmanabham, March, police

అమరావతి, జూలై 26 : ఈ రోజు నుండి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం తెలియజేసింది. ఎలాగైనా చేసి తీరుతామని ముద్రగడ పద్మనాభం తన ఇంటి నుంచి బయటకు రావడంతోనే పోలీసులు అడ్డుకున్నారు. తనను పాదయాత్రకు వెళ్ళనివ్వమని ముద్రగడ పట్టుపట్టారు, ఈ క్రమంలో పోలీసులకు ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ర్యాలీ, పాదయాత్ర చేయడానికి ఈ ప్రాంతంలో అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ముద్రగడకు మద్దతుగా వందల మంది వచ్చారు. ఆయన ఈ పాదయాత్రను ఆపకపోతే అరెస్టు చేసి కాకినాడకు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు. తాజా సమాచారం.... ముద్రగడ ను అరెస్టు చేసిన పోలీసులు, ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు అయన 24 వరకు గృహ నిర్బంధంలోనే ఉండాలన్న పోలీసులు.