ట్రంప్‌ మాజీ భార్యతో స్టార్ హీరోయిన్

SMTV Desk 2017-07-26 11:17:16  trump, mallikaa sharaavath, ivaanaa trump, ivaanka trump

లాస్‌ఏంజెల్స్, జూలై 26 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాజీ భార్య, ఒకప్పటి మోడల్‌ అయిన ఇవానాను బాలీవుడ్‌ స్టార్ మల్లికా శెరావత్‌ అనుకోకుండా అమెరికాలో కలిశారట. తనను కలిసిన సందర్భంగా మల్లికా ఇవానాతో ఒక సెల్ఫీ దిగి ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఇవానాను కలుసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని, ఆమె ఒక గొప్ప మహిళ అని మల్లికా ట్విట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇవానా బిజినెస్ చేస్తున్నారు. ఇవానా, ట్రంప్ ల కూతురే ఇవాంకా ట్రంప్‌.