జగన్ కి తండ్రి కంటే కేసీఆర్ అంటే మక్కువ ఎక్కువ...!

SMTV Desk 2018-12-08 16:06:53  Jaganmohan Reddy,Tulasi Reddy, KCR, YSR

విజయవాడ, డిసెంబర్ 8: తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ద్వంద్వ వైఖరి బయటపడిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అని వొకవైపు చెబుతూ.. మరోవైపు హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారా? అని మండిపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వం అని చెబుతున్న బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు.


వైస్సార్ ని నీటి దొంగ అని విమర్శించిన కేసీఆర్‌కు జగన్ మద్దతు ఇస్తున్నారని, జగన్ కి తండ్రి కంటే కేసీఆర్ ఎక్కువ అని ఆరోపించారు. రాజకీయాల కన్నా జగన్‌ తన ఆస్తులను కాపాడుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని వ్యాఖ్యానించారు.