హెచ్‌ఐవీనే ఓడించిన బాలిక!

SMTV Desk 2017-07-25 11:56:18  HIV, GIRL, WIN, PARIS, VIRUS CELLS

పారిస్, జూలై 25 : హెచ్‌ఐవీ ఒక ప్రాణాంతక వ్యాధి అలాంటి వ్యాధి పుట్టుకతోనే తల్లి నుంచి ఓ బాలికకు సోకింది. కాని 9 ఏళ్ల వయసులో ఆ లక్షణాలేవీ లేకుండా కోలుకుంది. వివరాలలోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక బాలికకు పుట్టుకతోనే రక్తంలో అధికస్థాయిలో హెచ్‌ఐవీ ఉందని గుర్తించారు. ఆ బాలికకు 9 వారాల వయసులో యాంటీ రెట్రోవైరల్‌ చికిత్స ప్రారంభించి.. 40 వారాల వరకూ కొనసాగించి ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఎలాంటి చికిత్స అందించలేదు. అయినా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఆ బాలికలో హెచ్‌ఐవీ వైరస్‌ తిరిగి చైతన్యం కాలేదు. రోగనిరోధక వ్యవస్థ కణాల్లో స్వల్పంగా హెచ్‌ఐవీ గుర్తులు ఉన్నా కూడా తిరిగి అవి వైరస్‌ కణాలను ఉత్పత్తి చేసే స్థితిలో లేవని గుర్తించారు. ఈ వైరస్‌ చైతన్యం కాకపోవడానికి ముందస్తు చికిత్స అందించడమే కారణమని వైద్యులు భావిస్తున్నారు.