చలికాలంలో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే

SMTV Desk 2018-11-28 15:14:34  winter, hairs,

హైదరాబాద్, నవంబర్ 28:సాధారణంగా చలికాలంలో మనం జుట్టు గురించి అసలు పట్టించుకోము. దీనివలన జుట్టు చిట్లిపోయి, ఎరుపు రంగులోకి మారడం, జుట్టు రాలిపోవడం సంభవిస్తుంది . అలాకాకుండా ఉండాలంటే జుట్టు సంరక్షణకోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా సీజన్ మారితే శరీరంలో కూడా మార్పులు జరగడం సహజం. చలికాలంలో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలాగో చూద్దాం.(Normally in winter season the hairs will damage due to the undisclosed reasons for this we are bringing you a very healthy tips to our viewers)

1. చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఊడి పోతుంది. లేదా డ్యామేజ్ అవుతుంది. తడి జుట్టును ఆత్రంగా దువ్వితే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది.

2. చలికాలంలో ఓపెన్ హెయిర్‌తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుబడుతుంది. ఈ చిక్కును విడిపించడానికి కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల జుట్టు ఊడి పోతుంది. డ్రైగా మారుతుంది. వారంలో రెండుసార్లకు మించి తలస్నానం చేయకూడదు.

3. మార్కెట్లో ఉండే కెమికల్ షాంపులను ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు, డ్రైనెస్ మరింత పెరుగుతుంది. కాబట్టి చలికాలంలో నేచురల్ షాంపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. జుట్టు స్టైలింగ్, లేదా జుట్టు తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రయ్యర్స్, రోలర్స్, కర్లింగ్ ప్రొడక్టస్ వంటి హీట్ కలిగించే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించకపోవడం మంచిది.