రికార్డు సృష్టించిన రాకుమారుడి చొక్కా!

SMTV Desk 2017-07-24 17:15:29  landon, prince, son, shirt, viliyam kate, birthday

లండన్, జూలై 24 : ప్రిన్స్‌ విలియం తన కుటుంబంతో కలిసి జర్మనీ, పోలాండ్‌లో పర్యటించారు. ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్టన్‌ దంపతుల రాకుమారుడు జార్జి వేసుకున్న చొక్కా రికార్డు సృష్టించింది. అవును తను వేసుకుంది ప్రముఖ స్పానిష్‌ బ్రాండ్‌ టిజ్జా చొక్కా అలాంటిది మరి.. తన బుల్లి జార్జి పుట్టినరోజు సందర్భంగా వేసుకున్న చొక్కా టిజ్జా బ్రాండ్‌కి చెందిన వని మీడియా ప్రచురించడంతో లండన్‌కి చెందిన వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవే చొక్కాలు కొనాలని నిర్ణయించుకున్నారట. దీంతో 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో స్టాక్‌ ఖాళీ అయిపోగా టిజ్జా కంపెనీ యాజమాన్యం తమ అధికారిక వెబ్‌సైట్‌లో మరింత స్టాక్‌ను ఉంచేలా ఏర్పాట్లు చేసిందట. ఇంతకీ ఈ చొక్కా ఖరీదెంతో తెలుసా? 9 పౌండ్లు(సుమారు రూ.7000). దీనిని వంద శాతం కాటన్‌తో తయారుచేసినట్లు తెలుస్తోంది.