ఆఫ్ఘానిస్తాన్ బాంబు పేలుడులో 50 మంది మృతి

SMTV Desk 2017-05-31 11:24:28  afghanisthan ,kabul,bomb blast,german forighan office

కాబూల్‌, మే 31: భారీ పేలుడుతో అఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ దడదడ లాడింది. పేలుడు తీవ్రత అత్యధికంగా ఉండడంతో పేలుడు జరిగిన ప్రాంతాల పరిసరాలలో భూకంపం చోటు చేసుకుందేమోనని అందరూ ఉలిక్కిపడ్డారు.విదేశీ రాయబార కార్యాలయాల సమీపంలో జరిగిన పేలుడు ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు. వివిధ దేశాల విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు మరియు అధిక రద్దీ సమయాన పేలుడు చోటు చేసుకోవడంతో దాదాపు 50 మందికి పైగా మృతి చెందినట్లు వెల్లడవుతున్నది. జర్మన్‌ మిషన్‌ ఇన్‌ కార్యాలయం వద్ద కారు బాంబును పేల్చినట్లు నిర్ధారించారు. బాంబు దాడిలో భారత రాయబారి కార్యాలయం కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. సిబ్బంది మాత్రం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో అమెరికా దౌత్యకార్యాలయం కూడా ఉంది. ఇప్పటివరకు 60 మంది గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య కూడా భారీగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే భారత రాయబార సిబ్బందికి ఎలాంటి హాని జరుగలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్ లో పోస్టు చేశారు.