మాస్కో, జూలై 20 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఆ దేశ మీడియా షాకింగ్ విషయాలను వెల్లడించింది. పుతిన్ తన లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి రాయల్‌స్టాగ్ (దుప్పి) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారని అక్కడి ఛానల్ తెలిపింది. దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో చాలా రకాల శారీరక సమస్యలు నయమవుతాయని అక్కడి వారి నమ్మకం. అంతేకాకుండా అక్కడ దుప్పి రక్తంతో కోట్లలో వ్యాపారం జరుగుతోంది. కేవలం10 మిల్లీలీటర్ల రక్తం వంద డాలర్లు విలువ చేస్తుందట. అంతేకాకుండా పుతిన్ స్నానం చేయడానికి గతేడాది 70 కిలోల దుప్పి కొమ్ములు సేకరించినట్లు ఆరోపించింది. ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తే, మరికొందరు సేవిస్తారని రష్యన్ మీడియా పేర్కొంది.