శ్రీకాకుళం లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయి

SMTV Desk 2018-10-24 14:08:32  titlee toofan,srikakulam,mp kalavenkat rao,

శ్రీకాకుళం, అక్టోబర్ 24: తిత్లీ తుపాన్ దెబ్బకు శ్రీకాకుళం మొత్తం అందకారమైపోయింది. దాదాపు 12 రోజులుగా 10 వేలమంది సిబ్బంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడగా శ్రీకాకుళం లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయి. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 98 శాతం విద్యుత్ సరఫారా చేసి, మరికొన్ని రోజుల్లోగా వ్యవసాయానికి కూడా విద్యుత్ ని అందజేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కళా వెంకట రావ్ హామీ ఇచ్చారు.

నాలుగైదు గ్రామాలకు మినహా మిగతా ప్రాంతాలన్నింటికీ విద్యుత్ పనులు పూర్తి చేయగలిగామని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అయితే తిత్లీ విద్యుత్ శాఖకు మంచి గుణపాఠం నేర్పిందని.. ఈ అనుభవంతో కొత్త ఆలోచనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం మీద పన్నెండు రోజుల పాటు చీకట్లో మగ్గి..నరకం అనుభవించిన సిక్కోలు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.